![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద ఫస్ట్ జనరేషన్ యాంకర్స్ లో ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హోస్ట్ సుమ అన్న విషయం మనకు తెలుసు. యాంకర్ గా ఇండస్ట్రీలో ఆమెకు ఎంతో గుర్తింపు కూడా ఉంది. హీరోలు ఆమె డేట్స్ ఇచ్చాకే మూవీ ప్రొమోషన్స్ స్టార్ట్ చేసుకుంటారు.
సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ, మూవీ ఈవెంట్స్ కి, బుల్లి తెర షోస్ కి హోస్ట్ గా, ఫారెన్ లో ఏమన్నా షోస్ జరిగిన వాటికి అటెండ్ అవుతూ ఆమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటారు. అంత బిజీగా ఉండే సుమ తన భర్త రాజీవ్ తో కలిసి రీసెంట్ గా తిరుమల వెళ్లారు. ఈమె తాజాగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇక ఈ పిక్స్ ని తన ఇంస్టాగ్రామ్ తిరుమల ఘాట్ రోడ్ లో కారు పక్కకు ఆపి తిరుమల అందాలను వీక్షిస్తూ ఉన్నటువంటి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో రాజీవ్ ను చూస్తే వెంకటేశ్వర స్వామి మాలలో ఉన్న విషయం తెలుస్తోంది. రాజీవ్ కనకాల కూడా ఇప్పుడు కొన్ని మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా కొంత బిజీగానే ఉన్నారు. రీసెంట్ గా పెదకాపు మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈయన. ఇండస్ట్రీలో సుమ, రాజీవ్ ఇద్దరూ పోటాపోటీగా సంపాదిస్తున్నారని చెప్పొచ్చు.
హీరోయిన్ కావాలనుకున్న సుమ అందులో సక్సెస్ కాలేకపోయారు దాంతో బుల్లితెరకె అంకితమయ్యారు అలాగే హోస్టింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక వీళ్ళ అబ్బాయి రోషన్ త్వరలోనే హీరోగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇండస్ట్రీలో సింగర్ సునీత, హోస్ట్ సుమ ఇద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్.. సునీతో కొడుకు ఆల్రెడీ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సుమ కొడుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు.
![]() |
![]() |